ఆసుపత్రిలో చేరిన నటుడు శరత్ కుమార్..!!
Sarathkumar Admitted To Hospital: ప్రముఖ తమిళ నటుడు శరత్ కుమార్ తీవ్ర అస్వస్థతకు డయేరియాతో డీహైడ్రేషన్ కు గురైన ఆయన ప్రస్తుతం చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
Sarathkumar Admitted To Hospital: భార్య రాధిక, కుమార్తె వరలక్ష్మీ ఆస్పత్రికి చేరుకున్నారు. దీని సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీంతో తమిళ సినీ వర్గాల్లో టెన్షన్ మొదైంది. శరత్ కుమార్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేస్తున్నారు. శరత్ కుమార్ త్వరగా కోలుకుని త్వరలోనే ఇంటికి రావాలని సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు.
ప్రముఖ తమిళ హీరో శరత్ కుమార్‌కు డిసెంబర్ 2020లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని, ఈ విషయాన్ని ఆయన భార్య రాధిక ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. శరత్‌కు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది, అయితే తనికి ఎటువంటి లక్షణాలు కనిపించలేదు కాని మంచి వైద్యుల పర్యవేక్షణలో జాగ్రత్తగా చికిత్స పొందుతున్నాడు.
ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అందజేస్తామని పేర్కొంటూ ట్వీట్ చేశారు రాధిక. ఇదే విషయాన్ని ఆయన కుమార్తె ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ప్రకటించారు. తన తండ్రి శరత్ కుమార్‌కు కరోనా వైరస్ ఉందని, అతను ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నాడని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆయన కోలుకుంటున్నారని ఆమె తెలిపారు. అయితే ఇవాళ మళ్లీ శరత్ కుమార్ అస్వస్థతకు గురి కావడంతో సినీ వర్గాల్లో టెన్షన్ మొదలైంది.
The post ఆసుపత్రిలో చేరిన నటుడు శరత్ కుమార్..!! appeared first on Chitrambhalare.
#ఆసపతరల #చరన #నటడ #శరత #కమర.