“ఓ మాదిరిగా” అంటూనే మరొక హిట్ సాంగ్ తో వచ్చిన సిందూరం సినిమా

“ఓ మాదిరిగా” అంటూనే మరొక హిట్ సాంగ్ తో మన ముందుకు వచ్చిన సిందూరం సినిమా…

శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడా సాగ ప్రధాన తారాగణంగా షూటింగ్ పూర్తి చేసుకున్న సిందూరం సినిమాలోని మొదటి పాట(ఆనందమో ఆవేశమో) ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. వారం రోజులపాటు యూట్యూబ్ మ్యూజిక్ టాప్ 30లో ఈ పాట ట్రెండింగ్ లో ఉంది. ఆదిత్య మ్యూజిక్ ఛానల్ ద్వారా విడుదలైన ఈ పాట చానల్ హ్యాక్ అవడంతో కనపడకుండా పోయింది. ఇప్పుడు ఆదిత్య మ్యూజిక్ తెలుగులో మొదటి పాట తో పాటు రెండవ పాటను కూడా రిలీజ్ చేశారు.

img 20221207 wa00001051431395665888620
Director Parasuram releases song “Oo madiriga’

“ఓ మాదిరిగా” అంటూ సాగే ఈ పాటను సక్సెస్ఫుల్ డైరెక్టర్ పరుశురాం గారు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాట చాలా బాగుంది అని, హరి సంగీతం ఫ్రెష్ ఫీల్ ఇచ్చిందని, సత్య ప్రకాష్, హరిణి చాలా బాగా పాడారని, బాలాజీ గారి సాహిత్యం బాగుందని, లీడ్ పెయిర్ బాగా యాక్ట్ చేశారని కొనియాడారు.
మొదటి పాటకు వచ్చినట్టే ఈ పాటకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని డైరెక్టర్ శ్యామ్ తుమ్మలపల్లి, ప్రొడ్యూసర్ ప్రవీణ్ రెడ్డి జంగా మరియు టీమ్ అంతా ఆశిస్తున్నారు.
యూట్యూబ్ లో అందుబాటులో ఉన్న ఈ పాటకు నెటిజనుల నుండి ఆల్రెడీ మంచి రెస్పాన్స్ వస్తుంది, మ్యూజికల్ హిట్ పక్కా అని, యంగ్ టీం బాగా చేశారని చెప్తున్నారు. మీకోసం ఈ క్రింద రెండు పాటల లింక్స్ పెట్టడం జరిగింది. మీరు కూడా ఓ లుక్కెయ్యండి…

Ohh Madhiriga song

నటీనటులు: శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడ సాగ(పవి టీచర్)

సాంకేతిక నిపుణులు:
బ్యానర్: శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్
డైరెక్టర్: శ్యామ్ తుమ్మలపల్లి
నిర్మాత: ప్రవీణ్ రెడ్డి జంగా
సహా నిర్మాతలు: చైతన్య కందుల, సుబ్బారెడ్డి.ఏం
రైటర్: కిషోర్ శ్రీ కృష్ణ
సినిమాటోగ్రఫీ: కేశవ్
ఎడిటర్: జస్విన్ ప్రభు
ఆర్ట్: ఆరే మధుబాబు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రామ బాలాజీ.డి

Anandamo Avesamo Song



#ఓ #మదరగ #అటన #మరక #హట #సగ #త #వచచన #సదర #సనమ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *