దిల్ రాజు మాస్టర్ ప్లాన్… చిరు, బాలయ్య కి కష్టాలు తప్పవా ?
Varisu, Waltair Veerayya, Veera Simha Reddy: సంక్రాంతి పండగ అంటేనే మన తెలుగు రాష్ట్రాల్లో సినిమాల హడావుడి ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు పెద్ద హీరోల సినిమాలు పోటాపోటీగా విడుదల చేస్తారు. అయితే రాబోయే సంక్రాంతి 2023 కి తెలుగు సినిమాల విడుదల చేయాలని ప్రొడ్యూసర్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అయితే దీనిలో దిల్ రాజు నిర్మిస్తున్న విజయ్ వారసుడు సినిమా కూడా ఉంది.
Varisu, Waltair Veerayya, Veera Simha Reddy: వీటితో పాటు మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమాలు వీరసింహారెడ్డి, వాల్తేర్ వీరయ్య పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. అయితే దిల్ రాజు మొదటి నుండి సినిమాల పంపిణీ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన నా స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
ఏదైనా చిన్న సినిమా కానీ పెద్ద సినిమా కానీ విడుదల చేయటంలో అలాగే థియేటర్లో బుక్ చేయటం లో దిల్ రాజు కి సాటి ఎవ్వరు రారు. ఇప్పుడు చిరంజీవి అలాగే బాలకృష్ణ సినిమాలు కి పెద్ద అడ్డుగా ఏర్పడింది. ఈ మూడు సినిమాలు సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు డేట్లు కూడా ప్రకటించారు.
థియేటర్ల విషయంలో దిల్ రాజ్ సినిమా అయినా వారసుడు కి ముందస్తుగా 100 థియేటర్లు అగ్రిమెంట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. పెద్ద హీరోల సినిమాలకు పాపులర్ సెంటర్లలో ఎటువంటి ఇబ్బంది రాదు, కానీ సింగిల్ స్క్రీన్ డబల్ స్క్రీన్ సెంటర్లో ఇది చాలా పెద్ద సమస్యగా మారుతుంది.
– Advertisement –
ఎందుకంటే ఈ సెంటర్ లోనే దిల్ రాజు థియేటర్ల అగ్రిమెంట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. దీంతో సింగిల్ స్క్రీన్స్ లో దిల్ రాజ్ సినిమా ఒకటే విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డబుల్ స్క్రీన్ ల్లో బాలయ్య-మెగాస్టార్ ఏదో ఒకరి సినిమా మాత్రమే వుంటుంది.
ఇలా చూస్తే వీరసింహారెడ్డి, వాల్తేర్ వీరయ్య సినిమాలో నిర్వహిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ కి బాక్సాఫీస్ వద్ద నష్టాలు రావటం ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజమో కాదో తెలియదు కానీ ఫిలిం సర్కిల్ లో ఈ న్యూస్ బాగా సర్క్యులేట్ అవుతోంది. మరి దిల్ రాజు మాస్టర్ ప్లాన్ కి ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిందో కొన్ని రోజులు ఆగితే గానీ తెలియదు.
#దల #రజ #మసటర #పలన.. #చర #బలయయ #క #కషటల #తపపవ