ధమాకా ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన రవి తేజ..!!
Dhamaka Trailer Release Date: త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ అలాగే శ్రీలీల జంటగా వస్తున్న సినిమా ధమాకా. ఈ సినిమాని డిసెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకు సిద్ధం చేశారు. ఈరోజు ధమాకా ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు.
Dhamaka Trailer Release Date: మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ధమాకా’ టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దాదాపు ప్రతి పాట చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ధమాకా సినిమా విడుదల తేది దగ్గర పడటంతో ప్రమోషన్ లో భాగంగా ధమాకా ట్రైలర్ ని డిసెంబర్ 15న విడుదల చేస్తున్నట్టు ఈ రోజు ప్రకటించారు. ఇంటెన్స్ లుక్ లో ఉన్న రవితేజ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

‘ధమాకా’ ట్రైలర్ పోస్టర్‌లో రవితేజ క్లాస్ అవతార్‌లో సూట్‌లో కళ్లజోడుతో కనిపించారు. ఇందులో క్లాస్ , మాస్ అవతార్‌లలో రవితేజ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. సినిమాలో యాక్షన్, ఇతర అంశాలతో పాటు హై ఎంటర్ టైన్మెంట్ వుండబోతుంది.
శ్రీలీల కథానాయిక గా నటిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్వహిస్తున్నారు. రవితేజ ధమాకా సినిమాతో మళ్ళీ హిట్ లైన్ లోకి రావాలని ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు.
#ధమక #టరలరక #మహరత #ఫకస #చసన #రవ #తజ.