మంట పుట్టిస్తున్న గుంటూరు కారం తెలుగు రాష్ట్రాల బిజినెస్..!
Guntur Kaaram Business, Magesh Babu Guntur Kaaram Pre Release Business, Guntur Kaaram Telugu states business report, Guntur Kaaram Shooting update, First single release date.
Magesh Babu – Guntur Kaaram Business: మహేష్ బాబు అలాగే త్రివిక్రం దర్శకత్వంలో 12 ఏళ్ల తర్వాత మళ్లీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గుంటూరు కారం అనే మాస్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో శ్రీ లీల అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా చేస్తున్నారు. జనవరి 12న సంక్రాంతికి విడుదల చేస్తామంటూ ఇప్పటికే రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్ ఈ సినిమాని శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు హైదరాబాదు లొకేషన్స్ లో. అయితే ఇప్పుడు గుంటూరు కారం రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 120 కోట్ల బిజినెస్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.
మహేష్‌బాబు, త్రివిక్రమ్‌ల భారీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్‌లో అద్భుతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది, ఈ సినిమా మేకర్స్ ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లు ఫిక్స్ చేయడం జరిగింది. ఇక బిజినెస్ (Business) విషయానికి వస్తే.. నైజాం ఏరియాలో 45 కోట్ల రేషియోలు ఉన్నాయి. ఆంధ్ర 60Cr పరిధిలో ఉంది… సీడెడ్ ప్రాంతం 18Cr పరిధిలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఓవరాల్‌గా చిన్నపాటి చర్చలతో సినిమా బిజినెస్ 120 కోట్ల రేంజ్‌లో క్లోజ్ అవుతుందని, వరల్డ్‌వైడ్‌గా 155 కోట్ల రేంజ్‌లో ఉంటుందని అంచనా వేస్తున్నారు.
అయితే దీనికి కారణం కూడా లేకపోలేదు రీసెంట్గా సినిమాకు సంబంధించిన ప్రొడ్యూసర్ నాగ వంశి ఇచ్చిన ఇంటర్వ్యూలో గుంటూరు కారం మొదటి సాంగు (Guntur Kaaram first song) సంబంధించిన అప్డేట్ ఇవ్వడం జరిగింది. శేఖర్ మాస్టర్ దర్శకత్వం వహించిన ఈ సాంగ్ మహేష్ బాబు కెరీర్ లోనే అత్యంత మాస్ సాంగ్ గా ఉంటుందని చెప్పటంతో అటు ఫాన్స్ లోనూ అలాగే ఇటు బిజినెస్ పరంగా కూడా సినిమాపై భారీగా హైప్ పెరిగింది.
అంతేకాకుండా అతడు, కలేజా వంటి సినిమాలో తర్వాత త్రివిక్రమ్ అలాగే మహేష్ బాబు కలిసి మూడోసారి చేయటం వల్ల ఈ సినిమాపై భారీగానే అంచనాలు పెరిగాయి . హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు.
#మట #పటటసతనన #గటర #కర #తలగ #రషటరల #బజనస.