విరూపాక్ష 2 సీక్వెల్ లో హీరో ఎవరు..?
Akhil Akkineni in talk for blockbuster Virupaksha 2 squeal, Sai Dharam Tej and Akhil multi-starrer movie, Akhil Akkineni next movie details, Akhil Akkineni new movie, Virupaksha 2 update.
బైక్ యాక్సిడెంట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ రిలీజ్ అయిన మూవీ విరూపాక్ష. సంయుక్త మీనన్ హీరోయిన్ గా చేసిన ఈ సినిమాకి కార్తీక్ దండు దర్శకత్వం వహించడం జరిగింది. సినిమా విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టడమే కాకుండా భారీ విజయాన్ని అందుకుంది.. ఈ సినిమా కి సిక్వెల్ ఉంటుంది అని దర్శకుడు అలాగే మేకర్స్ కూడా కన్ఫామ్ చేయడం జరిగింది. అయితే వీరుపాక్ష 2 సినిమాలో హీరో ఎవరు అనేది సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది దీనికి కారణాలు కూడా లేకపోలేదు.
ఇక విషయంలోకి వెళ్తే సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష 2 సినిమాలో మరో హీరో అంటూ అఖిల్ పేరైతే వినపడుతుంది. ఏజెంట్ మూవీ డిజాస్టర్ తర్వాత అఖిల్ తన తదుపరి సినిమా గురించి ఇంతవరకు ఎక్కడా అనౌన్స్మెంట్ అయితే చేయలేదు.. కొత్త దర్శకులు అలాగే స్టోరీలు డిస్కషన్ లో ఉన్నట్టయితే తెలుస్తుంది. లేటెస్ట్ గా అందుతున్న సమాచారం మేరకు వీరుపాక్ష దర్శకుడు కార్తీక్ దండు కొన్ని రోజుల క్రితం అఖిల్ని కలిసి విరూపాక్ష 2 సంబంధించిన స్టోరీ నారేషన్ ఇవ్వడం జరిగిందంట.
అయితే అఖిల్ కూడా వీరుపాక్ష 2 స్టోరీ విన్న తర్వాత పాజిటివ్గా స్పందించడం జరిగిందని న్యూస్ అయితే ఫిలింనగర్లో చెక్కర్లు కొడుతుంది. దీనిపై ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది. మరి దర్శకుడు కార్తీక్ దండు అఖిల్ అలాగే సాయి తేజ మల్టీ స్టార్ గా వీరుపాక్ష 2 సినిమాని తీసుకువస్తున్నారా లేదంటే అఖిల్ తో సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.
ఈ సంవత్సరం ఏప్రిల్ లో విడుదలైన వీరుపాక్ష సినిమా సాయి ధరమ్ తేజ్ కేరళలో బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది.. దానితోపాటు బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ వచ్చాయి. అయితే సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ కావడంతో అఖిల్ విరూపాక్ష 2 చేస్తే బాగుంటది అంటూ ఫ్యాన్స్ అలాగే మూవీ లవర్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమానే కాకుండా అఖిల్ ఏజెంట్ మూవీ సినిమా టైమ్ లోనే కొత్త దర్శకుడు అనిల్ కుమార్ చెప్పిన స్టోరీకి ఓకే చేయటం జరిగింది. మరి ఇంకొన్ని రోజులు పోతే గాని ఈ రెండు సినిమాలు మీద క్లారిటీ అనేది రాదు.
#వరపకష #సకవల #ల #హర #ఎవర.