Avatar 2 Censor Report and Runtime details
Avatar 2 Censor Report and Runtime: జేమ్స్ కెమెరూన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగని ఈ పేరు ప్రపంచంలో ఎవరికీ తెలియని వాళ్లంటూ ఉండరు. అవతార్ ఈ సినిమాతో ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టించిన జేమ్స్ కెమెరూన్ ఇప్పుడు అవతార్ 2 సినిమాని ఓల్డ్ వైడ్ గ విడుదల కు సిద్ధం చేశారు. అవతార్ 2 ట్రైలర్ అలాగే టీజర్ విజువల్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి.
Avatar 2 Censor Report: అవతార్ 2 సినిమాని ఇండియాలో కూడా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాని ఈ సారి ఇండియాలో 3d టెక్నాలజీ తో విడుదల చేయటానికి సిద్దం చేశారు. ఇక అవతార్ 2 సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు అన్ని దేశాల్లోనూ దాదాపుగా పూర్తి చేశారు. వరల్డ్ వైడ్ గా అవతార్ 2 సినిమా డిసెంబర్ 16వ తేదీన విడుదల కాబోతోంది.
అవతార్ 2 సంబంధించిన సెన్సార్ ఇండియాలో కూడా పూర్తి చేయడం జరిగింది. విడుదల చేసిన సెన్సార్ రిపోర్ట్ ప్రకారం 192 నిమిషాల 10 సెకండ్ల రన్ టైం తో విడుదలకు సిద్ధం చేశారు. ఈ సినిమా రన్ టైం మొదటి పార్టు కంటే చాలా ఎక్కువనే చెప్పాలి. మూడు గంటలకు పైగా సినిమా కంటెంట్ తో పాటు విజువల్ ఎఫెక్ట్స్ కూడా భారీ స్థాయిలో అబ్బురపరిచే విధంగా ఉంటాయి అని చెప్పవచ్చు.
హాలీవుడ్ సినిమాలు చాలా వరకు రన్ బ్యాండ్ చాలా తక్కువ ఉంటాయి అనే విషయం మనకు తెలిసిందే. అయితే దర్శకుడు జేమ్స్ కెమెరూన్ అవతార్ 2 విజువల్స్ తో అందర్నీ ఆకర్షించే విధంగా ఈ సినిమాని రూపొందించడం జరిగింది అంట. ఈ పార్ట్ గనుక సక్సెస్ అయితే కొనసాగింపుగా పార్ట్ 5 వరకు మరిన్ని కథలు వచ్చే అవకాశం ఉంటుంది అని దర్శకుడు చెప్పటం కూడా జరిగింది.
ఇండియాలో కూడా ఈ సినిమాని భారీ స్థాయిలో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 100 కోట్లు డిమాండ్ చేసినట్లుగా సమాచారం. అయితే బాక్సాఫీస్ ట్రేడ్ వర్గాలు ఈ సినిమా 500 కోట్ల పైనే కలెక్షన్స్ నీ నీ రాబడుతుందని అంచనా వేస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత ఆడియన్స్ కి ఎంత మాత్రం కనెక్ట్ అవుతుందో వేచి చూడాలి.
– Advertisement –
#Avatar #Censor #Report #Runtime #details